Ayyo Papam Song Lyrics Yevadu Movie (2013)
Movie: Yevadu
Lyrics: Ramajogayya Sastry
Music: Devi Sri Prasad
Singers: Ranjith, Mamatha Sharma
సబ్ ఆషికోంకీ మాషుకా హూ మై
సబ్ దీవనోంకీ దిల్ రుబా హూ మై
హే హిందిలో ఆపి తెలుగులోకి రాయె హె
హే గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగా రావు
హే గాజువాక సెంటరు కాడ గాజుల కొట్టు గంగా రావు
సైజే చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు
అయ్యో పాపం అయ్యో పాపం
హే జువ్వల పాలెం జుంక్షను కాడ ఆ టైలరు షాపు టైగరు బాబు
అరే జువ్వల పాలెం జంక్షను కాడ ఆ టైలరు షాపు టైగరు బాబు
చూపులతోనే సుట్టుముట్టి కొలతలు తీసాడే
అయ్యో పాపం అయ్యో అయ్యో పాపం
హే ఖద్దరు షేకు కాజావలి అత్తరు లెక్కన మత్తే చల్లి
ఆడ ఈడ తేడా తేడా చేసాడే అయ్యో పాపం
మిలిటరీ హోటల్ మున్నా గాడు పౌల్ట్రీ ఫారం పండుగాడు
బ్యూటీ పార్లరు బంటీ గాడు చీకటైతే చాలు పిట్టగోడ దూకుడే
హెయ్ అయ్యొ పాపం హెయ్ అయ్యొ అయ్యొ పాపం
ఆరె అయ్యొ పాపం హెయ్ అయ్యయ్యయ్యొ పాపం
తింగరి మల్లిగాడు మా దగ్గర చుట్టం వాడు
ఎల్దాం పద ఐమాక్స్ అంటూ టికెట్టు తీసాడు
తీరా క్లైమాక్సు అయ్యేలోపే నన్ను ఎక్స్ రే తీసాడు
ఏ చాల్లె టక్కు టమారి చెప్పమాకే కాకమ్మ స్టోరీ
ఇంటెర్వెల్లుకె నీకు ఇంకో పార్టీ సెట్టయి పోయాడు పాపం
టికెట్టు తీసిన మల్లిగాడు బుక్కయి పోయాడు
హో అమాయకంగా ఉండేదాన్ని అమ్మాయిల్లో కొత్త రకాన్ని
అయ్యోరామా నాపై ఇన్ని నిందలు ఎందుకని
జంతరు మంతరు కంత్రీ రాణి
ఎక్కువలన్ని తక్కువ కానీ
నీ ఫ్రంటు బ్యాకు హిస్టరీ మొత్తం తెలిసిన కుర్రాన్ని
మా అమ్మ తోడు నాన్నమ్మ తోడు ఊరికి వచ్చిన మైసమ్మ తోడు
ఏ పాడు మచ్చ ఎరుగడు ఈడు ఐనాగాని నన్నీ పోరగాడు నమ్మడే
అరె అయ్యో పాపం అయ్యయ్యయ్యో పాపం
హా స్టూడెంటు కుర్రగాడు మా పక్కింట్లో ఉండేవాడు
ఇంగ్లీషు నాకు నేర్పిస్తనంటూ ట్యూషను పెట్టాడు
తీరా ఇంటికి పోతే ఇంగ్లీషు ముద్దుల టెన్షన్ పెట్టాడు
ఏలెడు పిల్లోడే వాడు L K G చదివే వాడు
నీలాంటి పోరి పక్కింట్లో ఉంటే పాడై పొతాడు
పచ్చి పిందెంటి వాడు నీ చూపు సోకి పండి పోతాడు
అంతో ఇంతో అందంగా ఉంటా అయస్కాంతాన్నే మింగేసి ఉంటా
అందరి కల్లు నా మీదే పడితే అరిగి పోతుందే
అక్కడ ఇక్కడ ఎవ్వరి కంట ఎక్కువె నువ్వు చెప్పవె గుంటా
నీకంత సీను సినిమా లేదు తెలుసుకోమన్న
ఓలమ్మోలమ్మో వీడెక్కడోడే నా నెత్తికెక్కి తైతక్కలాడే
ఏ మాట అన్నా వేడెక్కుతాడే వీడి జోలికెల్తే వీపు మోత మోగుడే
హే అయ్యో పాపం అయ్యొ అయ్యో పాపం అయ్యో పాపం
అరె అయ్యో పాపం అరరె అయ్యయ్యయ్యో పాపం అయ్యో పాపం

0 Comments