Aunana Kaadana Song Lyrics Leader Movie (2009)



Aunana Kaadana Song Lyrics Leader Movie (2009)

Movie: Leader
Lyrics: Veturi
Music: Mickey J Meyer
Singers: Naresh Iyer, Swetha Pandit


ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..
మూగమైనా రాగమేనా
నీటిపైనా రాతలేనా
ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..

తార తారా దూరమైనా చోటనే ఆకాశాలు
కన్ను నీరు వెల్లువైతే వెన్నెలే కాబోలు
నింగి నేలా ఏకమైనా పొత్తులో సింధూరాలు
నీకు నెను చేరువైనా ఎందుకో దూరాలు
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది
ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా...
ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..

బాసలన్నీ మాసిపోయి ఆమనే ఆహ్వానించే
శ్వాసలేలే బాసలన్ని భాదలై పోయేనా
పూల జడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే
రాసలీల రక్తధార భాదలై పోయేనా
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది
తెలిసింది తెలిసింది నిజమేదో తెలిసింది
కురిసింది విరిసింది మెరుపేదో విరిసింది
ఇందుకేనా... ప్రియా... ఇందుకేనా...
ఔననా కాదనా నాదనా ఓ.. ఓ..
లేదనా రాదనా వేదనా ఓ.. ఓ..
Reactions

Post a Comment

0 Comments