Asalem Gurthuku Radu Song Lyrics Antahpuram Movie (1998)
Movie: Antahpuram
Lyrics: Sirivennela
Music: Ilayaraja
Singers : Chitra, Ilayaraja
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
అసలేం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం పాటు నిన్ను చూడకా
నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా
ఉన్నా నేను నీ కోసం నువ్వు దూరమైతే బతకగలనా
ఏం గుర్తుకురాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా
అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడ నిన్ను చూడకా
గోరువెచ్చని ఊసుతో చిన్న ముచ్చటని వినిపించనీ
ఆకు పచ్చని ఆశతో నిన్ను చుట్టుకుని చిగురించనీ
అల్లుకోమని గిల్లుతున్నది చల్ చల్లని గాలి
తెల్లవారులు అల్లరల్లరి సాగించాలి
ఏకమై ఏకమయే ఏకాంతం లోకమయే వేళ
ఆహా జంట ఊపిరి వేడికి మరిగింది వెన్నెలా
!!అసలేం గుర్తుకురాదు!!
కంటి రెప్పల చాటుగా నిన్ను దాచుకుని బంధించనీ
కౌగిలింతల సీమలో కోట కట్టుకుని కొలువుండనీ
చెంత చేరితే చేతి గాజులు చేసే గాయం
జంట మధ్యన సన్నజాజులు హాహాకారం
మళ్ళీ మళ్ళీ... మళ్ళీ మళ్ళీ ఈ రోజూ రమ్మన్నా రాదేమో
నిలవనీ చిరకాలమిలాగే ఈ క్షణం
!!అసలేం గుర్తుకు రాదు!!

0 Comments