Ammayi Kitiki Pakkana Song Lyrics Maryada Ramanna Movie (2010)



Ammayi Kitiki Pakkana Song Lyrics Maryada Ramanna Movie (2010)

Movie:  Maryada Ramanna
Lyrics:  Anantha Sriram
Music:  M M Keeravani
Singers  :  Karunya, Chitra


అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి
అమ్మాయి కిటికీ పక్కన కూర్చుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటక్కి డెబ్బై మైళ్ళ వేగంతోటి
ఈ లోకం పరిగెడుతుందండి

అక్కడ చూడు తాడి చెట్టుంది
ఆకులు ఊపి టాటా చెబుతుంది
జాబిలి ఎందుకు వెంటే వస్తుంది
నీ పైన మనసై ఉంటుంది
పైకి కిందికి ఊగే నేల ఏమంది
నువ్వు ఊ అంటేనే ఊయలవుతానంది
మీదెకి వచ్చే గాలేమనుకుంటుంది
నీ ఉసులు మోయాలంటుందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ
అమ్మాయి గుమ్మం దగ్గర నుంచుంది
గుమ్మంలోంచెం కనబడుతుంది
గంటక్కి ఎనభై మైళ్ళ వేగంతోటి
ఏవేవో ఆలోచిస్తుంది

ఊహించని మజిలీ వచ్చింది
నాలో ఊహల్ని మలుపులు తిప్పింది
ఇప్పటి వరకు ఎరగని సంతోషాన్ని
ఇట్టేనా ముందర ఉంచింది
చల్లని చీకటి చుట్టు కమ్ముకు వస్తుందీ
వెచ్చని చలిమంటకి ఆ చీకటి కరిగిందీ
నిదురలోనె కవ్వించె కల కన్నా
నిజమెంతో అందంగా ఉందీ
ఒహ్హోహ్హోహోహో.ఊహూహూహూ

అమ్మాయి కిటికీ పక్కన పడుకుంది
కిటికీలోంచెం కనబడుతుంది
గంటకి తొంబై మైళ్ళ వేగంతోటి
కునుకొచ్చి వాలిపోయింది

Reactions

Post a Comment

0 Comments