Raa Raa Song Lyrics Chandramukhi Movie (2005)



Raa Raa Song Lyrics Chandramukhi Movie (2005)

Movie:  Chandramukhi
Lyrics:  Bhuvanachandra
Music:  Vidya Sagar
Singers:  Binni Krishnakumar, Tippu
Cast     :  Rajnikanth, Nayanathara


రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా
రారా సరసకు రారా
రారా చెంతకు చేరా
ప్రాణమే నీదిరా ఏలుకో రా దొరా
శ్వాసలో శ్వాసవై రారా

తోం తోం తోం
తోం తోం తోం

నీ పొందు నే కోరి అభిసారికై నేను వేచాను సుమనోహరా
కాలాన మరుగైన ఆనంద రాగాలు వినిపించ నిలిచానురా
తననన ధీం త ధీం త ధీంత తన
తననన ధీం త ధీం త ధీంత తన
తననన ధీం త ధీం త ధీంతన
వయసు జాలవోపలేదుర
మరులుగొన్న చిన్నదాన్నిరా
తనువు బాధ తీర్చ రావేరా రావేరా
సల సల సల రగిలిన పరువపు సోగయిది
తడిపొడి తడిపొడి తపనల స్వరమిది రా రా రా

ఏ బంధమో ఇది ఏ బంధమో
ఏ జన్మబంధాల సుమగంధమో
ఏ స్వప్నమో ఇది ఏ స్వప్నమో
నయనాల నడయాడు తొలి స్వప్నమో
విరహపు వ్యధలను వినవా
ఈ తడబడు తనువును కనవా
మగువల మనసుల తెలిసి
నీ వలపును మరచుట సులువా
ఇది కనివిని ఎరుగని మనసుల కలయిక
సరసకు పిలిచితి విరసము తగదిక
జిగిబిగి జిగిబిగి సొగసుల మొరవిని
మిలమిల మగసిరి మెరుపుల మెరయగా రా రా రా
రా రా

Reactions

Post a Comment

0 Comments