Mounama O Mounama Song Lyrics Nanna Nenu Naa Boyfriends Movie (2016)


Mounama O Mounama Song Lyrics Nanna Nenu Naa Boyfriends Movie (2016)

Movie:  Nanna Nenu Naa Boyfriends
Lyrics:  Chandrabose
Music:  Sekhar Chandra
Singer:  Prakash Parighosh
Cast:  Hebah Patel, Noel Sean, Ashwin, Parvatheesam


మౌనమా ఓ మౌనమా మాటలేదుగా
పాదమా ఓ పాదమా బాటలేదుగా
తొలి ప్రేమలోని ఆటలో గెలిచావు నీవు హాయిగా
ఆ ప్రేమలేని చోటులో నిలిచావు నేడు రాయిగా
గుండె చప్పుడు ఆగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే
ఆశ ఆవిరై పోతుందే
శ్వాస భారమై పోతుందే
ప్రేమ మాయమై పోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే

వెలుగులలో నువ్వు మునకేసి చీకటి తీరం చేరావే
చిరునవ్వే నువ్వు ఉరితీసి బాధకు ఊపిరి పోసావే
సరదా సరదా స్వేచ్ఛను తెంచి సంకెలలాగా మార్చావే
జతగా బ్రతికే బదులే వెతికి జవాబు లేనట్టి ప్రశ్నల్లె మిగిలావే
గుండె చప్పుడు ఆగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే
తప్పు ఉప్పెనై పోతుందే
ప్రేమ తప్పుకువెళ్లి పోతుందే
తల్లకిందులై పోతుందే ఆరి పోతుందే తెల్లారి పోతుందే

నేరమనేది నీది కదా శిక్ష పడేది అందరికా
తప్పు అనేది నీది కదా నొప్పి అనేది అందరికా
మూడే ముళ్ళు ప్రేమే కోరగా మూడు ముళ్ళులతో గుచ్చావే
ఏడూ అడుగులుగా ప్రేమను మార్చగా ప్రేమన్న పదానికి అర్ధాన్ని మార్చావే

గుండె చప్పుడు ఆగిపోతుందే
కంటినీరు పొంగిపోతుందే
కాలమిట్ట మారిపోతుందే పారి పోతుందే చేయి జారి పోతుందే
చిక్కు పెద్దదై పోతుందే దిక్కు తోచకుండ పోతుందే
లెక్క నేడు మారిపోతుందే తీరి పోతుందే చేయి జారి పోతుందే

Reactions

Post a Comment

0 Comments