Maa Voori Devudu Song Lyrics Alluda Majaka Movie (1995)



Maa Voori Devudu Song Lyrics Alluda Majaka Movie (1995)

Movie:  Alluda Majaka
Lyrics:  Veturi
Music:  Koti
Singer:  SP Balu
Cast     :  Chiranjeevi,. Ramya Krishna, Ramba


మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ భళిరా భళిరా భళిరా
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

చుక్కా చుక్కల లేడి రాంభజన
సూది కన్నుల లేడి రాంభజన
చుక్కా చుక్కల లేడి రాంభజన - అవును
సూది కన్నుల లేడి రాంభజన
రామయ్య నలుపంట సీతమ్మ తెలుపంట
పరువాల ఈ పంట ప్రజల కన్నుల పంట
శ్రీరాముడి కళ్యాణమే సీతమ్మకే వైభోగము
మాతల్లికే పేరంటము లోకాలకే ఆనందము
చైత్రమాస కోకిలమ్మ పూలమేళమెట్టెనంట
నింగి వంగి నేల పొంగి జంటతాళమేసెనంట

చెల్లిపోని మమతలకి చెల్లెలు సీతమ్మరా
తాళికట్టు బావయ్యే తారక రామయ్యరా
తుళ్లిపడ్డ కన్నెలకి పెళ్లీడు పాపలకి
వలచిన వరుడంటే రామచంద్రుడే
రాతినైన నాతిగచేసి కోతినైన దూతగ పంపే
మహిమే నీ కథ రామా...
ఓ మాట ఓ సీత ఓ బాణమన్నావు
ధర్మానికే నీవు దైవానివైనావు
అన్నంటే నీవంటు ఆదర్శమైనావు
కన్నోళ్లకే నీవు కన్నీళ్లు తుడిచావు
ఆకాశ పందిళ్లు భూలోక సందళ్లు ఓ రామ నీ పెళ్లికే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
దేవుడి గుడిలో హారతి తిప్పు... తిప్పు తిప్పు తిప్పు...
దేవుడి గుడిలో హారతి తిప్పు దొరుకును దోసెడు వడపప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు
బిందె పానకం బిరబిర తిప్పు రామచరిత హరికథగా చెప్పు

ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
విన్నాను మారీచకూత వాడు లంకేశుడి మాయదూత
లేడల్లె వచ్చాడు ఘాత వాణ్ణి బాణానికేస్తాను మేత
ఏదిర లక్ష్మణ సీత పర్ణశాలలో లేదెందుచేత
ఏదిరా లక్ష్మణ సీతా పర్ణశాలలో లేదెందుచేత
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
వాడి అంతుచూసి నే నాడతా...
వాడి గొంతుపిసికి నే పాడతా...
నే నాడతా... నే పాడతా...
నే నాడతా... నే పాడతా...

రక్కసి బాధలేని పల్లెటూళ్లు మావూళ్లురా
మంథర మాటవినే కైకలేదురా
సీత సిరి పండించే మళ్లు ఉన్న మాగాణిరా
కలిమికి చోటు ఇదే కరువులేదురా
బుజ్జగింపు ఉడతకిచ్చి పుణ్యమేమొ కప్పకిచ్చే
ఘనతే నీ కథ రామా...
కంచర్ల గోపన్న బంధాలు తెంచావు
శబరి ఎంగిలి పళ్లు నువ్వారగించావు
త్యాగయ్య గానాల తానాలు చేశావు
బాపూజీ ప్రాణాల కడమాటవైనావు
సీతమ్మ రామయ్య పెళ్లాడుకుంటుంటే
భూలోక కళ్యాణమే...
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
ఓ రామా రఘురామా - జగమేలే జయరామా
కదిలి రావయ్యా కళ్యాణరామా
మనువు కోరింది సీతమ్మ
భళిరా భళిరా భళిరా...
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు
మా ఊరి దేవుడు అందాల రాముడు
మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు

Reactions

Post a Comment

0 Comments