Chinnanati Chelikade Song Lyrics Yagnam Movie (2004)



Chinnanati Chelikade Song Lyrics Yagnam Movie (2004)

Movie:  Yagnam
Lyrics:  Sirivennela
Music:  Manisharma
Singers:  Shreya Ghoshal, SP Balu
Cast     :  Gopichanda, Sameera Benerjee


చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ....
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ....
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ఓ.... ఓ....
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ....

సూర్యుడైనా చల్లారడా వాడిలో వేడికి
దాడిలో వాడికి ఎప్పుడూ ఆ ధాటి కనలేదని
చంద్రుడైనా తలదించడా చెలియ చిరునవ్వుకి
చెలిమిలో చలువకి ఎన్నడూ తన సాటి కాలేనని
చిగురాకులై కొండలే ఊగవా చెలరేగు వేగానికి..
సిరిమువ్వలై గుండెలే మ్రోగవా వయ్యారి సయ్యాటకి
మాటల్లో మంటలు మనసంతా మల్లెలు స్నేహానికి అర్థమే తానుగా
రమ్మనే ఆ అల్లరి కమ్మగా మది తాకిడి

తరలిరావా ఆ తారలూ రేయి నడిజాములో
వాలుజడసీమలో జాజులై తల దాచుకుంటామని
మురిసిపోవా రాదారులు వాయువేగాలతో
వేయి సరదాలతో తానిలా వస్తున్న కబురే విని
మారాణి పారాణి పాదాలతో ఈ నేల పులకించగా
మారాల గారాల గానాలతో ఈ గాలి కవ్వించగా
కురిసే చిరుజల్లులు విరిసే హరివిల్లులు ముందే చెలి రాకనే చూపగా
జుమ్మనే నా ఊపిరి ఆమెకే ఎదురేగనీ ఓ...
చిన్ననాటి చెలికాడే చురకత్తిలాంటి మొనగాడే
ఇన్నినాళ్ళు నా నీడై ఎదిగాడే.. ఓ....
చిన్ననాటి సిరిమల్లి ఈనాటి కన్నె జాబిల్లి
వెన్నెలల్లె కన్నుల్లో కొలువుందే ఓ....
రమ్మనే తన అల్లరి ఝుమ్మనే నా ఊపిరి ఓ.... ఓ...ఓ.
Reactions

Post a Comment

0 Comments