Cheli Vinamani Song Lyrics Ala Modalaindi Movie (2011)
Movie: Ala Modalaindi
Lyrics: Sirivennela
Music: Kalyani Malik
Singer: Hemachandra
Cast : Nani, Nitya Menon
చెలీ.. వినమనీ చెప్పాలి మనసులో తలపునీ
మరీ... ఇవ్వాలే త్వరపడనా
మరో.. ముహూర్తం.. కనబడునా
ఇది ఎపుడో... మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ
తనక్కూడా ఎంతోకొంతా ఇదే భావం వుండుంటుందా
కనుక్కుంటె బాగుంటుందేమో
అడగ్గానె అవునంటుందా అభిప్రాయం లేదంటుందా
విసుక్కుంటు పొమ్మంటుందేమో
మందార పువ్వులా కందిపోయీ
చీ అంటె సిగ్గనుకుంటాం కానీ
సందేహం తీరకా ముందుకెలితే
మరియాదకెంతో హానీ
ఇది ఎపుడో.... మొదలైందనీ అది ఇప్పుడే తెలిసిందనీ
పిలుస్తున్న వినపడనట్టూ పరాగ్గా నేనున్ననంటూ
చిరాగ్గా చినబోతుందో ఏమో
ప్రపంచంతో పన్లేనట్టూ తదేకంగా చూస్తున్నట్టూ
రహస్యం కనిపెట్టేస్తుందేమో
అమ్మాయి పేరులో మాయ మైకం
ఏ లోకం చూపిస్తుందో గానీ
వయ్యారి ఊహలో వాయువేగం
మేఘాలు దిగిరానందీ...
ఇది ఎపుడో.. ఇది ఎపుడో.. మొదలైందనీ .. మొదలైందనీ
అది ఇప్పుడే.. అది ఇప్పుడే.. తెలిసిందనీ .. తెలిసిందనీ

0 Comments