Aley Ley Aley Ley Song Lyrics Mruga Raju Movie (2001)



Aley Ley Aley Ley Song Lyrics Mruga Raju Movie (2001)

Movie:  Mruga Raju
Lyrics:  Veturi
Music:  Manisharma
Singers:  Udit Narayana, S P Sailaja
Cast:  Chiranjeevi, Simran


అలెలే అలెలే మా అలెలే మామా
అలెలే మామా అలెలే మామా
అలెలే అలెలే మా అలెలే మామా
అలెలే మామా అలెలే మామా
అలెలే అలెలే మా అలెలే మామా
అడవి మల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అది మరులకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు సానా
ఏ... కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క
హే... జున్ను ముక్క జుర్రుకుపోనా చక్కనిచుక్కా
అలెలే అలెలే మా అలెలే మామా
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ తెగమరిగిన మామా
కొరకని జామ నీ చిలకది రామా
చుక్క లొచ్చే దాకా నిన్ను ఆపేదెట్టా
ఓహో దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

హే... జమాయించు
ఓ... తమాయించు
పువ్వుల బోనాలు చిరునవ్వుల దాణాలు
పుంజుకు పెట్టేస్తే లేత ముంజెల ముద్దిస్తా..
వెన్నెల బాణాలు నులి వెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మావా జాతరకొచ్చేస్తా
హే ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
యహ్... కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా
అలెలే అలెలే మా అలెలే మామా
అడవి మల్లంటి పడుచోయమ్మ
అలెలే మామా అలెలే మామా
హే... యమాగుంది...
ఈ... జమాబందీ...
చింతల తోపుల్లో నీ చింతలు దోచేస్తా
సంతల బేరాల్లో భామా సిగ్గులు తూచేస్తా
చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మావా చాటుగ సందిస్తా
హే... రేపోమాపో లగ్గాలెట్టి లంగర్లేస్తా
అహ... ఆటూపోటూ అడ్డేలేని ఒడ్డే చూస్తా
అలెలే అలెలే మా అలెలే మామా
అలెలే మామా అలెలే మామా
అలెలే అలెలే మా అలెలే మామా
అడవి మల్లంటి పడుచోయమ్మ
మరదలు కూన అది మరులకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు సానా
ఏ... కన్ను కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క
హే... జున్ను ముక్క జుర్రుకుపోనా చక్కనిచుక్కా
Reactions

Post a Comment

0 Comments