Toonega Toonega Song Lyrics Manasantha Nuvve Movie (2001)
Movie: Manasantha Nuvve
Lyrics: Sirivennela
Music: R P Patnaik
Singers : Sanjeevini, Usha
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీక ఉంటగా నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా
ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్కా
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలేయకు సీతాకోక చిలకలుగా
వామ్మొ బాగుందె ఇట్టా నాకూ నేర్పిస్తె చక్కా
సూర్యుడ్నె కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడీ నీతో ఆడీ చందమామ అయిపొయ్యాడుగా
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
ఆ కొంగలు ఎగిరీ ఎగిరీ సాయంత్రం గూటికి మళ్ళీ తిరిగొచ్చె
దారిని యెపుడూ మరిచిపోవెలా
ఓ సారెటువైపేవెళుతుంది
మళ్ళీ ఇటు వైపొస్తుందీ
ఈ రైలుకి సొంతూరేదో గురుతు రాలెదా
కూ కూ బండీ మా ఊరుందీ
ఉండిపోవే మాతొపాటుగా
తూనీగ తూనీగ ఎందాకా పరిగెడతావే రావే నా వంకా
దూరంగా పోనీకా ఉంటగా నీ వెనకాలా రానీ సాయంగా
ఆ వంకా ఈ వంకా తిరిగావె ఎంచక్కా
ఇంకానా చాలింకా... ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
0 Comments