Krishnam Vande Jagadgurum Krishnam Vande Jagadgurum Movie (2012)
Movie: Krishnam Vande Jagadgurum
Lyrics: Sirivennela
Music: Manisharma
Singers: S P Balu, Chorus
జరుగుతున్నదీ జగన్నాటకం ...జరుగుతున్నదీ జగన్నాటకం ...
పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కధనం
నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్ధం
జరుగుతున్నది జగన్నాటకం ...జరుగుతున్నది జగన్నాటకం ...
చెలియలి కట్టను తెంచుకుని విలయము విజృంభించునని
ధర్మ మూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని
సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి
నావగ తోవను చూపిన మత్స్యం కాల గతిని సవరించిన సాక్ష్యం
చేయదలచిన మహత్కార్యము మోయజాలని భారమైతే
పొందగోరిన దందలేని నిరాశలో అణగారి పోతే
బుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీరసించక
ఓటమిని ఓడించగలిగిన ఓరిమే కూర్మమన్నది
క్షీర సాగర మధన మర్మం
ఉనికిని నిలిపే ఇలను కడలి లో కలుపగ ఉరికే ఉన్మాదమ్మును
కరాళదంషృల కుళ్ళగించి ఈ ధరాతలమ్మును ఉద్ధరించగల
ధీరోద్దాటిరణ హుంకారం ఆది వరాహపు ఆకారం
ఏడీ ఎక్కడ రా నీ హరి దాక్కున్నాడేరా
భయపడి బయటకు రమ్మనరా
ఎదుటపడి నన్ను గెలవగాలడా తలబడి
నువ్వు నిలిచిన ఈ నేలని అడుగు ఈ నాడుల జీవ జాలమ్ముని అడుగు
నీ నెత్తుటి వెచ్చదనాన్నడుగు నీ ఊపిరిలో గాలిని అడుగు
నీ అడుగుల ఆకాశాన్నడుగు నీలో నరునీ హరినీ కలుపు
ననీవే నరహరివని నువు తెలుపు
ఉన్మత్త మాతంగ భంగి కాటుక విధతి
మంత్రు సంగాతమీ ధృడమి విడమీ జగతి
అహము రధమై ఎదిగే అవనికిదే అస నిహతి
ఆకతాయుల నిహతి అనివార్యమౌ నియతి
శిత హస్తి హత మస్తకాది నఖసమకాసియో
కౄరాసి క్రోసి హృతదాయదంస్త్రుల ద్రోసి వసి చేయ మహిత యజ్ఞం
అమేయమనూహ్యమనంత విశ్వం
ఆ భ్రహ్మండపు సూక్ష్మ స్వరూపం ... ఈ మానుష రూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింప చేసే ... అల్ప ప్రమాణం
ముజ్జగాలనూ మూడడుగులతో కొలిచే ... త్రైవిక్రమ విస్తరణం
జరుగుతున్నదీ జగన్నాటకం ... జగ జగ జగ జగమే నాటకం
జరుగుతున్నదీ జగన్నాటకం ... జగ జగ జగ జగమే నాటకం
పాపపు తరువై పుడమికి బరువై పెరిగిన ధర్మగ్యానివి పెరుగక
పరశురాముడై భయద భీముడై పరశురాముడై భయద భీముడై
ధర్మాగ్రహ నిగ్రహుడై నిలచిన శౌత్రియ క్షత్రియ తత్వమే భార్గవుడు
ఏ మహిమలూ లేక ఏ మాయలూ లేక నమ్మశక్యము గాని ఏ మర్మమూ లేక
మనిషిగానే పుట్టి మనిషి గానే బ్రతికి మహిత చరితగ మహిని మిగలగలిగే మనికి
సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచె
ఇన్ని రీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిన్ను నీకే నూత్నపరిచితునిగా
దర్శింప చేయగల జ్ఞాన దర్పణము కృష్ణావతారమే సృష్ట్యవరణతరణము
అణిమగా మహిమగా గరిమగా లఘిమగా ప్రాప్తిగా ప్రాగామ్యవర్తిగా
ఈశత్వముగా వశిత్వమ్ముగా నీ లోని అష్ట సిద్ధులూ నీకు తన్బట్టగా
స్వస్వరూపమే విశ్వరూపమ్ముగా ....
నరుని లోపలి పరుని పై దృష్టి పరుపగా
తల వంచి కైమోడ్చి శిష్యుడవు నీవైతే
నీ ఆర్తి కడతేర్చు ఆచార్యుడవు నీవే
వందే కృష్ణం జగద్గురుం ...వందే కృష్ణం జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం ...కృష్ణం వందే జగద్గురుం ...
వందే కృష్ణం జగద్గురుం ...వందే కృష్ణం జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం ...కృష్ణం వందే జగద్గురుం ...
కృష్ణం వందే జగద్గురుం
0 Comments