Godaralle Ponge Song Lyrics Vasantham Movie (2003)

Godaralle Ponge Song Lyrics Vasantham Movie (2003)

Movie:  Vasantham
Lyrics:  Kulasekhar
Music:  S A Rajkumar
Singer:  SP Balu

గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలస్సా
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండా నింపిదమ్మా నాలో సంగీతం
గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం

గుండెలో వేల ఆశలే నన్ను ఇంతగా పెంచాయిలే
కళ్ళలో కోటి కాంతులే పలు వింతలే చూపాయిలే
సంక్రాంతే రోజు నామదికి ఈ అనుభవమే నాకు కొత్త గున్నది
రానంటునే వచ్చిందమ్మా కొంటె కోయిల
రాగాలెన్నో తీసివమ్మా తియ్యతీయగా
గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం

గాలిలో మబ్బు రేకులా మనసెందుకో తేలిందిలే
హాయిగా పండు వెన్నెల పగలే ఇలా జారిందిలే
సందేహం లేదే నాకు మరి ఇది ఆనందం చేసే కొంటె అల్లరి
గుండెల్లోన ఉండాలంటే ఎపుడూ ఆరాటం
మాటల్లోన చెప్పాలంటే బ్రతుకే పోరాటం
గోదారల్లె పొంగే నాలో సంతోషం గోరింతల్లె పూచే నాలో ఆనందం
హరివిల్లై విరిసిందమ్మ కల్లలోన ఆశ
సిరిమువ్వై పలికిందమ్మా గుండెల్లోన శ్వాస
కలహంస నడకల్లోన అందాల హైలస్సా
నేడే తెచ్చిందమ్మ మల్లెల వాసంతం
నిండా నింపిదమ్మా నాలో సంగీతం
Reactions

Post a Comment

0 Comments