Balapam Patti Song Lyrics Bobbili Raja(1990)
Movie: Bobbili Raja
Lyrics: Sirivennela
Music: Ilayaraja
Singer: SP Balu
బలపం పట్టి
భామ బళ్లో
అఆఇఈ నేర్చుకుంటా
పంతం పట్టి ప్రేమ ఒళ్లో
ఆహా ఓహో
పాడుకుంటా
అం అః అంటా అమ్మడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
కమ్మహా ఉండేటప్పుడు
బుజ్జిపాపాయి పాఠాలు నేర్పించు
పైటమ్మ ప్రణయాలతో
సరసమింక ఎక్కువైతే
చ ఛాఛిఛీ తప్పదయ్యో
అపుడే ఇంత ప్రేమ బళ్లో
అయితే గియితే ఎందుకయ్యో
అచ్చులే అయ్యా యిప్పుడూ
హొయ్యారే హొయ్యారే హోయ్
హల్లుల్లో హల్లో ఎప్పుడు
ఎట్టాగుందె పాపా
తొలిచూపే చుట్టుకుంటే
ఏదో కొత్త ఊపే
ఎటు వైపో నెట్టేస్తుంటే
ఉండుండి ఎటుంచో
ఒక నవ్వే తాకుతోంది
మొత్తంగా ప్రపంచం
మహ గమ్మత్తుగా ఉంది
ప్రేమంటే ఇంతేనేమో
బాగుందే ఏమైనా
నాక్కూడా కొత్తేనయ్యో
ఏం చేద్దాం ఈపైనా
కాస్తయినా కంగారు తగ్గాలి
కాదన్ను ఏం చేసినా॥॥
తుప్పల్లో తుపాకి
సడి ఎట్టా రేగుతుందో
రెప్పల్లో రహస్యం
పడి అట్టా అయ్యిందయ్యో
కొమ్మల్లో కుకులే
మన స్నేహం కోరుతుంటే
కొండల్లో ఎకోలే
మనమెట్టా ఉన్నామంటే
అడివంతా అత్తారిల్లే నీకైనా నాకైనా
ఎవరెవరో అత్తా మామా
వరసెట్టా తెలిసేనే
అందాకా ఆ మర్రి అత్తమ్మ
ఈ మద్ది మామనుకో॥॥
పిచ్చి బుజ్జాయి అల్లర్లు తగ్గించి
ఒళ్లోన బజ్జోవయ్యో॥॥॥॥
0 Comments