Annayya Annavante Song Lyrics Annavaram Movie (2006)
Movie: Annavaram
Lyrics: Chandrabose
Music: Ramana Gogula
Singers: Mano, Ganga
అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదరవనా
కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా
కలతై ఉన్నావంటే కథనవనా
అమ్మలో ఉండే సగం అక్షరం నేనే
నాన్నలో రెండో సగం లక్షణం నేనే
అమ్మ తోడు నాన్న తోడు అన్నీ నీకు అన్నే చూడు
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
చూపులోన దీపావళి నవ్వులోన రంగోళి
పండుగలు నీతో రావాలి నా గుండెలోన వేడుక కావాలి
రూపులోన బంగారు తల్లి మాట మరుమల్లి
రాముడింట ప్రేమలు పంచాలి ఆ సీత లాగ పేరుకు రావాలి
నీలాంటి అన్నగాని ఉండి ఉంటే తోడూ నీడా
ఆనాటి సీతకన్ని కష్టాలంటూ కలిగుండేవా
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
కాలి కింది నేలను నేనే నీలి నింగి నేనే
కన్నుల్లోని నీరే నేనమ్మా
నన్ను నీవు జారినీకమ్మా
ఇంటి చుట్టు గాలిని నేనే తోరణాన్ని నేనే
తులసి చెట్టు కోటని నేనమ్మా నీ కాపలాగ మారనివ్వమ్మా
ముక్కోటి దేవతల అందరి వరం అన్నవరం
ఇలాంటి అన్న తోడు అందరికుంటే భూమే స్వర్గం
చెల్లిపోని బంధం నేనమ్మా చిట్టి చెల్లెమ్మా
వెళ్ళిపోని చుట్టం నేనమ్మా
అన్నలోని ప్రాణం నువ్వమ్మా చిట్టి చెల్లెమ్మా
ప్రాణమైన చెల్లిస్తానమ్మా
అన్నయ్య అన్నావంటే ఎదురవనా
అలుపై ఉన్నావంటే నిదురవనా

0 Comments