Nuvvu Marosari Song Lyrics Manasu Maata Vinadu Movie (2005)
Movie: Manasu Maata Vinadu
Lyrics: Sirivennela
Music: Kalyani Malik
Singers: Kalyani Malik, Zeena Roy
Cast: Navadeep, Ankitha
నువ్వు మరోసారి అను మరోసారి అను చిలకా
మది వినేలాగా అను
నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే తలపు అదే
తెరవిడి రాదేం త్వరగా
కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని
ఉరిమిన మేఘం తొలకరి శృతిలో పలికిందా..
ముదిరిన దాహం మధువుల నదిలో మునిగిందా..
నిన్ను తలపై నిలిపే చొరవిస్తే శివుడైపోనా దివి చినుకా
దిగివస్తాలే సొగసిస్తాలే
నీ పెదవేలే పదవే చాలే
నీకదే మోక్షమను సరే కాదనను
చిలిపి దుమారం చెలిమికి ద్వారం తెరిచిందా..
వయసు విహారం వెతికిన తీరం దొరికిందా..
నా గెలుపే తెలిపే చిరునవ్వై మహ మెరిశావే మణితునక
సఖి సావాసం ఇక నీ కోసం
ప్రతి ఏకాంతం నాకే సొంతం
ఈ అల్లరే ఇష్టపడి వరించాను నిన్ను
మరోసారి అను మరోసారి అను చిలకా
మది వినేలాగా అను
నువ్వు మరోసారి విను మరోసారి విను సరిగా
ఇది వెయ్యోసారి విను
మనసు తపన అదే తలపు అదే
తెరవిడి రాదేం త్వరగా
కలలుగనే కలను కనే కల అనుకుంటే కుదరదుగా
నేనెలా చెప్పనిక ముద్దిస్తావు అని

0 Comments