Nelanadiga Song Lyrics Priyamaina Neeku Movie (2001)



Nelanadiga Song Lyrics Priyamaina Neeku Movie (2001)

Movie:  Priyamaina Neeku
Lyrics:  Sirivennela
Music:  Shiva Shankar
Singer:  SP Balu
Cast     :  Tharun, Sneha, Sridevi


నేలనడిగా పులనడిగా నీలినింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదని
గాలినడిగా మబ్బులనడిగా రామచిలక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అని
ఐనా ఇంతవరకు ఆచూకి లేక తెగిన గాలి పటమై తిరిగా
ఎటు దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ ఏనాటికి చూపునో చిరునామా
నేలనడిగా పులనడిగా నీలినింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదని

ఇపుడే ఇటు వెళ్లిందంటూ చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుల్లో చెలి పరిమళముంది
ఇందాక చూసానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడి గంటల్లో తన జాజుల సడి వింటుంటే
తను ఈ కోవెల్లో ఇప్పటి వరకు ఉన్నట్టే
ఎటు చూసిన తన జాడలే ఎటు వెళ్లిందో ఈ లోపునే
నేలనడిగా పులనడిగా నీలినింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదని

నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండి పోతుంది
నడకైన నాట్యంలాగే అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి వచ్చిందనిపిస్తుంది
కొందరు చూసారో కలగన్నామనుకున్నారో
అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో
బతిమాలిన బదులివ్వదే తను ఉందంటే నను నమ్మరే
నేలనడిగా పులనడిగా నీలినింగి చుక్కలనడిగా

ప్రేమించిన చెలి ఏదని
గాలినడిగా మబ్బులనడిగా రామచిలక రెక్కలనడిగా
క్షేమంగా ఉందా అని
ఐనా ఇంతవరకు ఆచూకి లేక తెగిన గాలి పటమై తిరిగా
ఎటు దారి తోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమ ఏనాటికి చూపునో చిరునామా
నేలనడిగా పులనడిగా నీలినింగి చుక్కలనడిగా
ప్రేమించిన చెలి ఏదని

Reactions

Post a Comment

0 Comments