Mericeti Jabilli Song Lyrics Jayam Manadera Movie (2000)
Movie: Jayam Mandera
Lyrics: Sirivennela
Music: Vandematram Srinivas
Singers: Kumar Sanu, Swarnalatha
Cast : Venkatesh, Soundarya
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్
మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్
ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే
నా గుండెల చప్పుడు నువ్వే
ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్
అల్లుకో బంధమా
ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా
ఆదుకో ప్రణయమా
తుంటరి ఈడుని ఈ వేళ ఓదార్చనా ప్రియురాలా
నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని
నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ
మసక చీకట్లలో నా మనసు అందించనీ
ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ
నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది
ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది
మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే
నా కన్నుల కాంతివి నువ్వే
ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్
కలిసిరా అందమా
చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం
కరగవే సందేహమా
చక్కగ దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం
నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ
నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని
వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ

0 Comments